Nayanthara’s Hi: లేడీ సూపర్ స్టార్ నయనతార అభిమానులకు డబుల్ ధమాకా! ఒకే నెలలో రెండు విభిన్న పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నయన్. యశ్ నటించిన భారీ చిత్రం 'టాక్సిక్' ఆగస్టు 26న విడుదలవుతుండగా, అంతకంటే ముందే ఆమె నటించిన మరో చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్'. విష్ణు ఎడవణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాను ఆగస్టు 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఒక ఆసక్తికరమైన ప్రోమోను విడుదల చేశారు. వర్షంలో చేతిలో సంచి, మరో చేతిలో వేట కొడవలితో అమాయకంగా నిలబడి ఉన్న నయనతారను చూసి.. బైక్‌పై వచ్చిన కవిన్ షాక్ అవ్వడం, ఆపై ఇద్దరూ కలిసి వర్షంలో వెళ్లడం ప్రోమోలో చూపించారు.

టాక్సిక్' సినిమాలో 'గంగ'గా అల్ట్రా మోడర్న్ రోల్‌లో కనిపిస్తున్న నయనతార... 'హాయ్' చిత్రంలో శారీలో ఎంతో ఇన్నోసెంట్ లుక్‌తో మెప్పిస్తున్నారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ రెండు వేర్వేరు జానర్ చిత్రాలతో అలరించేందుకు నయన్ సిద్ధమయ్యారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story