Netizens Troll Ananya Panday: బాలీవుడ్ నటి అనన్యా పాండేకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. ఆమె నటనపై విమర్శల దగ్గరనుంచి, ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌పై వచ్చే మీమ్స్ వరకు.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆమె తరచూ నెటిజన్ల ఎగతాళికి గురవుతూనే ఉన్నారు.

గతంలో విజయ్ దేవరకొండ సరసన నటించిన “లైగర్” సినిమాలో ఆమె నటనపై భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆమె యాక్టింగ్ స్టైల్‌ను చాలా మంది గేలి చేశారు. అయితే, ఇటీవల కాలంలో ఆమె నటన కాస్త మెరుగవ్వడంతో నెటిజన్ల ట్రోలింగ్ కొద్దిగా తగ్గింది.

కానీ, ఇప్పుడు అనన్యా పాండే మరోసారి సోషల్ మీడియాలో విమర్శల పాలవుతున్నారు. మే 22న విడుదలైన ఆమె తాజా చిత్రం “చాంద్ మేరా దిల్” లోని ఒక సీన్ ప్రస్తుతం నెట్‌ఇంట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సీన్‌లో ఆమె ఒక ఇంజనీరింగ్ విద్యార్థినిగా, సాంప్రదాయ దుస్తులు ధరించి, నటరాజ విగ్రహం ముందు భరతనాట్యం చేస్తూ కనిపిస్తారు.

ఈ సీన్‌పై సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆమె డాన్స్ మూమెంట్లు, ముద్రలు చాలా బిగుతుగా (stiff), రోబోలా ఉన్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మీమ్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఒక వైరల్ పోస్ట్‌లో అయితే.. “భరతనాట్యం క్రీస్తుపూర్వం 200లో మొదలై, 2026లో అనన్యా పాండేతో అంతమైపోయింది” అంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. మొత్తానికి ఈ డాన్స్ సీన్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story