New OTT App Launched Exclusively in Telugu: తెలుగులో మరో కొత్త ఓటీటీ యాప్
మరో కొత్త ఓటీటీ యాప్

New OTT App Launched Exclusively in Telugu: 'చాయ్ బిస్కెట్' సంస్థ ప్రారంభించిన 'చాయ్ షాట్స్' ఓటీటీ యాప్ లాంచ్ ఈవెంట్‌కు ప్రముఖ నటుడు ,నిర్మాత రానా దగ్గుబాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రానా.. 'చాయ్ బిస్కెట్' సంస్థ వ్యవస్థాపకులు శరత్ (Sharath), అనురాగ్ (Anurag) లతో నాకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉంది. టీవీ షోలు, స్టేజ్ ఈవెంట్లు, సినిమా మార్కెటింగ్.. నా ప్రతి ప్రయాణంలోనూ వారు ఒక భాగమయ్యారు. వారు కొత్తగా ప్రారంభించిన ఈ 'చాయ్ షాట్స్' ప్రయాణంలో నేను కూడా ఒక చిన్న భాగం కావడం చాలా ఆనందంగా ఉంది.
"నేటి యువత తమ స్మార్ట్‌ఫోన్లలో నిరంతరం ఏదో ఒక కంటెంట్‌ను స్క్రోల్ చేస్తూనే ఉన్నారు. దీనికి భిన్నంగా, 'చాయ్ షాట్స్' ద్వారా 2 నిమిషాల లోపు ఉండే ప్రీమియం, స్క్రిప్టెడ్ కంటెంట్‌ను అందిస్తూ, వీక్షకులకు ఒక నిర్మాణాత్మకమైన, క్రమశిక్షణ గల వినోదాన్ని అందిస్తున్నారు." "ఈ వేదిక దాదాపు 200 మంది సృష్టికర్తలకు (Creators) ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. శరత్, అనురాగ్ ఆలోచనలు చాలా వినూత్నంగా ఉంటాయి. యువ ప్రేక్షకులకు ఏం కావాలో వారికి బాగా తెలుసు."చాయ్ షాట్స్ లోని కంటెంట్ సినిమా అంత ప్రజాదరణ పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ పని చేసే క్రియేటర్స్ మరియు స్టార్స్ కూడా సినిమా తారల స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. వారు నా నుండి ఏ సహాయం కోరినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అని అన్నారు.
చాయ్ షాట్స్ ద్వారా సీరియళ్లు, యువతకు అవసరమైన కార్యక్రమాలు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలను అందుబాటులోకి తేనున్నట్లు శరత్ చంద్ర వెల్లడించారు. రెండు నిమిషాల లోపు కథలు ఇందులో అందుబాటులో ఉంటాయని తెలిపారు. రూ.20కోట్ల పెట్టుబడితో, 200 మంది క్రియేటర్లతో ఈ వేదికను సిద్ధం చేశామని వెల్లడించారు.

