Ustaad: పవన్ ఉస్తాద్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటన
కొత్త రిలీజ్ డేట్ ప్రకటన

Ustaad: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మించారు. మార్చి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే థియేటర్లో పవర్ స్టార్ తుఫాన్ కాస్త ముందుగానే రాబోతోందంటూ గురువారం కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. అనుకున్న దానికంటే వారం ముందుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోందని మార్చి 19న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుందని తెలియజేశారు. ‘‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊచకోత ఉగాదికే’ అని చెప్పిన మేకర్స్.. లాంగ్ వీకెండ్ కలిసొచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో పార్తిబన్, కె యస్ రవికుమార్, ఎల్ బి శ్రీరామ్, రావు రమేష్, రాంకీ, కె జి ఎఫ్ అవినాష్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

