Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే వార్త
పూనకాలు తెప్పించే వార్త

Pawan Kalyan Fans: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే వార్త వచ్చేసింది. గతేడాది 'OG'తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు తన తదుపరి చిత్రం "ఉస్తాద్ భగత్ సింగ్"తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి "ఆరా ఆఫ్ ఉస్తాద్" (Aura of Ustaad) అనే రెండో పాటను ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన మొదటి పాట "దేఖ్ లేంగే సాలా" చార్ట్‌బస్టర్‌గా నిలవడంతో, ఇప్పుడు రాబోయే సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తుంటే, పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ అప్పీరెన్స్‌ను ఎలివేట్ చేసేలా ఒక అదిరిపోయే యాంథమ్‌ను దేవి శ్రీ ప్రసాద్ సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది.
గతంలో పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల మరియు రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న "ఉస్తాద్ భగత్ సింగ్", మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజికల్ హిట్ అవుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

