Nidhhi Agerwal: గ్లామర్ బ్యూటీ నుంచి సరికొత్త అవతార్‌లో నిధి అగర్వాల్
నిధి అగర్వాల్
Nidhhi Agerwal: గ్లామర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్.. ఇప్పుడు ఓ సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు ఆమె ఒక పవర్‌ఫుల్ మైథాలజీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
సోమవారం నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ‘తంత్ర’ సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీనివాస్ గోపిశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. వారాహ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సునీత్ పడోల్కర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మైథలాజికల్ టచ్‌తో రాబోతున్న ఈ థ్రిల్లర్ కథపై ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమా ప్రారంభోత్సవంతో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో నిధి అగర్వాల్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎవరూ ఊహించని విధంగా ఉంది. ఇప్పటివరకు మనం చూసిన నిధికి పూర్తిగా భిన్నంగా, ఒక సరికొత్త, పవర్‌ఫుల్ అవతారంలో ఆమె కనిపిస్తున్నారు. ఈ పోస్టరే సినిమా ఎలాంటి జోనర్‌లో సాగుతుందనే దానిపై క్యూరియాసిటీని పెంచేస్తోంది.
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, పౌరాణిక అంశాల కలబోతగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. మరి గ్లామర్ క్వీన్ నిధి అగర్వాల్.. ఈ మైథాలజీ థ్రిల్లర్‌తో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో వేచి చూడాల్సిందే
- NidhhiAgerwalNidhhiAgerwalNewsNidhhiAgerwalNewLookNidhhiAgerwalNewAvatarNidhhiAgerwalTransformationNewAvatarNewLookGlamorousNidhhiNidhhiAgerwalPhotoshootTheRajaSaabRajaSaabPrabhasTollywoodTeluguCinemaSouthIndianCinemaIndianCinemaCelebrityNewsEntertainmentNewsMovieNewsViralPhotosTrendingPhotosGlamourFashionCelebrityStyleActressStyleNidhhiAgerwalFansLatestCinemaNewsLatestEntertainmentNewsLatestTeluguNewsTeluguNewsBreakingNewsLatestNews

