ఇస్తే తీసుకుంటా

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా తన రెండో చిత్రం రాకాస ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ద్వారా నిర్మించిన మొదటి సినిమా కమిటీ కుర్రోళ్లు హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అంతే కాదు ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకుంది. అయితే ఆ సినిమాకు తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ప్రచారం చేయించుకోవడానికి ఆమె అప్పట్లో చాలా ట్రై చేసింది. కానీ కుదరలేదు. ఇప్పుడు తన రెండో సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోష న్స్ లో బాబాయ్ ను భాగం చేసే విషయమై తన మనసులోని మాట చెప్పింది.

ఉస్తాద్ భగత్ సింగ్ కు బాబాయ్ డేట్ ఇస్తే.. అందులో ఒకటో, రెండో తాను తీసుకుంటానని నవ్వుతూ చెప్పింది. ముందుగా ఆయన సినిమాలకు ఆయన ప్రచారం చేసుకోవాలని తాను కోరుకుంటానని, ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తే మాత్రం తాను కూడా తన సినిమా కోసం ప్రయత్ని స్తానని తెలిపింది. తాను కాన్ఫిడెంట్ గా ఇంటి నుంచి బయట అడుగు పెడుతున్నానంటే.. తన కుటుంబం ఉందన్న దైర్యంతోనే అని పేర్కొంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story