Nikhil Siddhartha: యుద్ధానికి సిద్ధమైన నిఖిల్.. ‘స్వయంభూ’ నుంచి ‘రా రా దేవరా’ వచ్చేస్తోంది!
‘స్వయంభూ’ నుంచి ‘రా రా దేవరా’ వచ్చేస్తోంది!

Nikhil Siddhartha: యువ హీరో నిఖిల్ సిద్ధార్థ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘స్వయంభూ’. ఈ సినిమా కోసం నిఖిల్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి కష్టపడుతున్నాడు. ఒక గొప్ప యోధుడి కథగా వస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా నుంచి తాజాగా చిత్ర బృందం ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాలోని మొదటి పాట ‘రా రా దేవరా’ ను ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది. దట్టమైన అడవిలో ఒక వీరుడిలా నిలబడి, శత్రువుపైకి ఈటెను విసరడానికి సిద్ధంగా ఉన్న నిఖిల్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాత్ర కోసం నిఖిల్ దాదాపు రెండేళ్ల పాటు కష్టపడి, తన శరీరాన్ని ఒక యుద్ధ వీరుడిలా మార్చుకోవడం విశేషం.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు మరో పెద్ద బలం ఏమిటంటే.. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలకు కెమెరా పనితనం అందించిన సెంథిల్ కుమార్ దీనికి సినిమాటోగ్రాఫర్. అలాగే ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ సినిమాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు.

