సోషల్ మీడియాలో ఎంగేజ్‌మెంట్ ఫోటోలు డిలీట్

Nivetha Pethuraj Calls Off Wedding: టాలీవుడ్ నటి నివేదా పేతురాజ్ వివాహంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టులో దుబాయ్‌కి చెందిన మలయాళీ వ్యాపారవేత్త రాజ్ హిత్ ఇబ్రాన్‌తో నివేదా నిశ్చితార్థం జరిగింది. గోప్యంగా జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్ గురించి తర్వాత సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే తాజాగా నివేదా - రాజ్ హిత్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఎంగేజ్‌మెంట్ ఫోటోలను తొలగించడంతో వీరి వివాహ బంధం రద్దయిందనే ఊహాగానాలు బలంగా మారాయి.

దాస్ కా ధమ్కీ, బూ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నివేదా, పెళ్లి కోసమే నటనకు విరామం ఇచ్చారని భావించారు. ఆగస్టులో నిశ్చితార్థం తర్వాత త్వరలోనే పెళ్లి ఉంటుందని ప్రచారం జరిగింది. అనూహ్యంగా ఫోటోలు డిలీట్ చేయడంతో, వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. మరోవైపు రాజ్ హిత్ ఇబ్రాన్‌కు గతంలో ఒక బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో నిశ్చితార్థం జరిగిందనే మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. ఈ ఊహాగానాలపై పూర్తి స్పష్టత రావాలంటే నివేదా నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

PolitEnt Media

PolitEnt Media

Next Story