Nivetha Pethuraj: Mega158 లోకి నివేథా పేతురాజ్.. క్రేజీ ప్రాజెక్టుతో సెకండ్ ఇన్నింగ్స్!
క్రేజీ ప్రాజెక్టుతో సెకండ్ ఇన్నింగ్స్!

Nivetha Pethuraj: టాలీవుడ్ చందమామ నివేథా పేతురాజ్ తెలుగు తెరపై మళ్లీ బిజీ అయ్యేందుకు సిద్ధమౌతోంది. తాజాగా ఆమె ఒక భారీ ఆఫర్‌ను దక్కించుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం Mega158 లో ఒక కీలక పాత్ర కోసం నివేథా ఎంపికైంది. ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌లో నివేథా ఇప్పటికే జాయిన్ అయిపోయింది. ఆమెకు సంబంధించిన కొన్ని కీలకమైన సీన్ల చిత్రీకరణ కూడా జరుగుతోందని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాలో ఆమె చేయబోయే క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని మాత్రం చిత్ర బృందం చాలా సీక్రెట్‌గా ఉంచింది.
గతంలో చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ ఇందులో చిరంజీవి కూతురిగా ఒక ప్రధాన పాత్రలో నటిస్తోంది.
గత రెండేళ్లుగా నివేథా పేతురాజ్ కొత్త సినిమాలేవీ సైన్ చేయకుండా కొంచెం గ్యాప్ తీసుకుంది. ఆ సమయంలో దుబాయ్‌కు చెందిన ఒక వ్యాపారవేత్తతో ఆమెకు నిశ్చితార్థం జరిగిందని, పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ బంధం ముందుకు సాగలేదు. ఆ తర్వాత ఇరుపక్షాలు తమ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఆ ఫొటోలను కూడా తొలగించాయి. ఇప్పుడు మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టిన నివేథా, నేరుగా మెగాస్టార్ సినిమాతోనే తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి వంటి స్టార్ పక్కన ఛాన్స్ దక్కడం ఖచ్చితంగా ఆమె కెరీర్‌కు గట్టి బూస్టింగ్ అనే చెప్పాలి.

