ఎవరూ వినరు: జాన్వీ

Janhvi Kapoor’s Emotional Statement: సినీ నటి జాన్వీ కపూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొంటున్న కష్టాలు, అలాగే స్టార్ కిడ్స్‌గా ఎదురయ్యే సమస్యలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

స్టార్ కిడ్స్‌గా మాకు కష్టాలు ఉండవని చాలామంది అనుకుంటారు. మా కష్టాల గురించి ఎవరికీ చెప్పినా సానుభూతి లభించదు" అని జాన్వీ అన్నారు. తమకు ఏ కష్టం వచ్చినా, అది చాలా చిన్నదని, పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తారని ఆమె అన్నారు.

స్టార్ కిడ్స్‌కు సులభంగా అవకాశాలు వస్తాయి అని అంతా అనుకుంటారని, కానీ ఇండస్ట్రీలో నిలబడాలంటే తాము కూడా చాలా కష్టపడాలని జాన్వీ తెలిపారు. ప్రతి సినిమాతోనూ తమ సత్తా నిరూపించుకోవాల్సిన ఒత్తిడి ఉంటుందని, లేకపోతే ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించడం కష్టం అని అన్నారు.

బయటి నుంచి వచ్చిన వారికీ, తమకూ ఒకే రకమైన సవాళ్లు ఎదురవుతాయని, చివరకు నిలబడాలంటే ప్రతిభ మాత్రమే ముఖ్యమని జాన్వీ చెప్పారు. తన తల్లి శ్రీదేవికి సినిమా పరిశ్రమలో ఉన్న పేరు కారణంగా తమకు అవకాశాలు సులభంగా వచ్చినా, తమ ప్రతిభను చాటుకుంటేనే నిలదొక్కుకోగలమని తెలిపారు. ఈ వ్యాఖ్యల ద్వారా జాన్వీ కపూర్, బయటి ప్రపంచానికి కనిపించే గ్లామర్ వెనుక స్టార్ కిడ్స్ కూడా కొన్ని ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటారని చెప్పే ప్రయత్నం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story