నేను చేస్తేనే టార్గెటా.. దీపికా సంచలన కామెంట్స్

Deepika’s Sensational Comments: స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇటీవల కొన్ని పెద్ద సినిమాల నుంచి తప్పుకోవడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి కారణం ఆమె పెట్టిన కఠినమైన షరతులే అని ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంలో దీపికా మీడియా ముందు నోరు విప్పింది. దీపికా పెట్టిన షరతుల్లో ముఖ్యమైంది. రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తాను అనేది. భారీ బడ్జెట్ సినిమాలకు ఇది సాధ్యం కాదంటూ నిర్మాతలు ఆమెను పక్కన పెట్టారని టాక్.

దీనిపై దీపికా ఇలా ఘాటుగా స్పందించింది:

"భారతీయ సినీ పరిశ్రమలో ఎంతోమంది సూపర్‌స్టార్లు చాలా ఏళ్లుగా 8 గంటలు మాత్రమే పని చేస్తున్నారు. ఇది ఎవరికీ తెలియని సీక్రెట్ ఏమీ కాదు. సోమవారం నుంచి శుక్రవారం వరకు పని చేసి వీకెండ్‌లో సెలవులు తీసుకుంటారు. వాళ్ల పేర్లు నేను చెప్పను, చెబితే విషయం పెంటపెంట అవుతుంది" అని దీపికా అన్నారు.

నన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?'

తాను ఒక్కదాన్నే ఈ రూల్ అడుగుతున్నట్లుగా టార్గెట్ చేయడంపై దీపికా అసహనం వ్యక్తం చేసింది. "ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన కొందరు హీరోయిన్లు కూడా ఇప్పుడు 8 గంటలే పని చేస్తున్నారు. కానీ వాళ్ల గురించి ఎవరూ మాట్లాడరు. నన్ను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు" అని ఆమె ప్రశ్నించింది.

ఈ కండిషన్ల వల్లే దీపికా మొదట అనుకున్న ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి తప్పుకోగా ఆ పాత్రలోకి త్రిప్తి డిమ్రి వచ్చింది. అలాగే ఆమె నటించిన కల్కి 2898 ఏడీ* సీక్వెల్‌లో కూడా నిబద్ధతతో పనిచేసేవారు అవసరం అంటూ దీపికాను తప్పించినట్లు వార్తలు వచ్చాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story