కానీ పిల్లలు కావాలి..శృతి షాకింగ్ కామెంట్స్

Shruti’s Shocking Comments: తనకు పెళ్లి అంటే భయమని, అందుకే వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తెలిపారు. పెళ్లి పట్ల భయం ఉన్నప్పటికీ, తల్లిగా మారాలనే ఆశ ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘కొందరు యువతులు పెళ్లి చేసుకుని స్వేచ్ఛను కోల్పోతున్నారు. కానీ ఇది నాకు అస్సలు నచ్చదు. ప్రేమలో ఉండటం మాత్రం నాకు నచ్చుతుంది. ప్రస్తుతం నేను సింగిల్‌గా హ్యాపీగానే ఉన్నా అంటూ చెప్పుకొచ్చింది.

గతంలో ఒకసారి తాను పెళ్లికి దగ్గరగా వచ్చి కొన్ని కారణాల వల్ల ఆ సంబంధం ముగిసిందని తెలిపింది. ప్రేమ, నిబద్ధత వంటి విషయాలను తాను నమ్ముతానని, అయితే వాటికి పెళ్లి అనే బంధం అవసరం లేదని ఆమె అభిప్రాయపడింది. గతేడాది విజువల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో విడిపోయిన తర్వాత శృతి హాసన్ ప్రస్తుతం సింగిల్ గా ఉంది.

ప్రస్తుతం ఒంటరితనంపై దృష్టి సారిస్తున్నానని, దాన్ని ఒంటరితనం అని కాకుండా ఏకాంతంగా భావిస్తున్నానని చెప్పింది. తనకు తల్లి కావాలనే కోరిక ఉందన్న శృతి .. పిల్లల పెంపకానికి ఇద్దరు తల్లిదండ్రులు అవసరమని చెప్పుకొచ్చింది. దత్తత తీసుకోవడం కూడా ఒక అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story