Tarun Bhascker: విజయ్ - రష్మిక పెళ్లికి ఆహ్వానం అందలేదు.. వస్తే వాట్సాప్ చేస్తా.. తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
వస్తే వాట్సాప్ చేస్తా.. తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Tarun Bhascker: టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లిపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ విషయంపై విజయ్ ఆప్తమిత్రుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ తనదైన శైలిలో స్పందించారు.
పెళ్లి వార్తలపై ప్రశ్న:
తరుణ్ భాస్కర్ నటిస్తున్న తాజా చిత్రం గాయపడ్డ సింహం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మీడియా ప్రతినిధులు ఆయనను విజయ్ పెళ్లి గురించి ప్రశ్నించారు. ఈ నెల 26న పెళ్లి అని వినిపిస్తోంది, మీరు వెళ్తున్నారా? అని అడిగారు. "నాకు ఇంకా పెళ్లి ఆహ్వానం అందలేదు. ఒకవేళ కార్డు వస్తే కచ్చితంగా మీకు వాట్సాప్ చేస్తాను. అప్పుడు మనమందరం కలిసి వెళ్దాం" అంటూ చమత్కరించారు. 2016లో వచ్చిన పెళ్లిచూపులు చిత్రంతో వీరిద్దరి ప్రయాణం మొదలైంది. ఆ సినిమా విజయ్‌కు స్టార్‌డమ్ తేవడమే కాకుండా, వీరిద్దరి మధ్య మంచి స్నేహాన్ని ఏర్పరిచింది. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 26న నిజంగానే పెళ్లి జరుగుతుందా లేదా అన్నది చూడాలి..

