Nora Fatehi’s Beauty Secret: నోరా ఫతేహి బ్యూటీ సీక్రెట్.. అందానికి కారణం ఆ ఫుడ్డేనా..?
అందానికి కారణం ఆ ఫుడ్డేనా..?

Nora Fatehi’s Beauty Secret: బాలీవుడ్ నటి నోరా ఫతేహి తన డ్యాన్స్‌తోనే కాదు మెరిసే అందంతోనూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంటారు. అయితే తన గ్లోయింగ్ స్కిన్ వెనుక ఉన్న రహస్యాన్ని ఆమె గతంలో చాలా సరదాగా వెల్లడించారు.
గతంలో ద కపిల్ శర్మ షోలో నోరా పాల్గొన్నప్పుడు.. హోస్ట్ కపిల్ ఆమె అందం గురించి ఆరా తీశారు. "మీ చర్మం ఇంతలా మెరిసిపోవడానికి ఏం తింటారు? మీ డైట్ ప్లాన్ ఏంటి?" అని ప్రశ్నించగా, నోరా తనదైన శైలిలో చమత్కరించారు. "నేను అందరిలాగే పాస్తా, అన్నం, పప్పు, రోటీ, ఉడికించిన బంగాళాదుంపలు తింటాను. నాకు కారు లేదు, నేను ఆటో రిక్షాలోనే ప్రయాణిస్తాను" అంటూ సరదాగా సమాధానమిచ్చి అందరినీ నవ్వించారు.
డ్యాన్సర్ నుండి నటిగా ఎదిగిన ప్రస్థానం
కేవలం ఐటెం సాంగ్స్ లేదా స్పెషల్ సాంగ్స్‌కే పరిమితం కాకుండా నోరా ఫతేహి నటిగా కూడా తన ముద్ర వేశారు. బాట్లా హౌస్, స్ట్రీట్ డ్యాన్సర్ 3D, మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్ వంటి సినిమాలతో మెప్పించారు. ప్రముఖ డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.
సౌత్ ఎంట్రీ.. కాంచన 4 సిద్ధం
ప్రస్తుతం నోరా తన దృష్టిని దక్షిణాది సినిమాలపై కూడా సారించారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రాబోతున్న భారీ హారర్ ఫ్రాంచైజీ కాంచన 4లో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు ఆమె మరింత చేరువయ్యే అవకాశం ఉంది.

