దీపికా కీలక కామెంట్స్

Deepika’s Key Comments: దీపికా పదుకొణె ఇటీవల ప్రభాస్ హీరోగా రాబోతున్న కల్కి సీక్వెల్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని స్పిరిట్ వంటి రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులను తిరస్కరించడంపై స్పందించారు. ఈ నిర్ణయం వెనుక పారితోషికం లేదా డేట్స్ సమస్యలు లేవని, తనకు ఆరోగ్యకరమైన పని వాతావరణమే తొలి ప్రాధాన్యత అని ఆమె స్పష్టం చేశారు.

బడ్జెట్ కాదు, ప్రాధాన్యత పని వాతావరణానికే

తాజా ఇంటర్వ్యూలో తన నిర్ణయంపై వస్తున్న విమర్శలకు దీపికా సమాధానమిచ్చారు. "సినిమా బడ్జెట్ రూ.100 కోట్లా లేక రూ.500-600 కోట్లా అనేది నా నిర్ణయాలపై ప్రభావం చూపదు. కొందరు భారీ పారితోషికం ఆఫర్ చేసినప్పటికీ, నాకు అది ముఖ్యం కాదు" అని ఆమె పేర్కొన్నారు. సినిమా స్థాయిని బట్టి తన ప్రాధాన్యతలు మారవని ఆమె పరోక్షంగా తెలియజేశారు.

8 గంటల పని విధానమే మేలు

ఆరోగ్యకరమైన పని వాతావరణం ఉన్నప్పుడే నటనలో ఉత్తమమైన ప్రదర్శన ఇవ్వగలమని దీపికా నొక్కి చెప్పారు. "ప్రతిరోజూ ఎనిమిది గంటల పనివేళలు సరిపోతాయి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన పనిలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలం" అని ఆమె వివరించారు. దీపికా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా దీపికా పదుకొణె ఇటీవలే విడుదలైన ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్, ట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story