నథింగ్ టు హైడ్.. చైతన్యకు బిగ్ షాకిచ్చిన సామ్

Samantha:టాలీవుడ్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం భాషల్లో అనేక మూవీల్లో నటించిన సామ్.. అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. అయితే కొంతకాలంగా సినిమా లకు దూరంగా ఉన్న ఈభామ.. ఇప్పుడు శుభం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి నిర్మా తగా వ్యవహరించిన సామ్.. అదే సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. సమంత ప్రస్తుతం 'రక్త బ్రహ్మాండ్' సిరీస్ కోసం వర్క్ చేస్తోంది. అలాగే తన నిర్మాణ సంస్థ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్పై 'మా ఇంటి బంగారం' సినిమా చేయనుంది. దీనికి తోడు ఒకవైపు నటిగా, మరోవైపు నిర్మాతగానే కాకుండా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. తాజాగా 'సీక్రెట్ ఆల్కమిస్ట్' సంస్థ ప్రమోషన్లో భాగంగా సామ్ ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. 'నథింగ్ టు హైడ్' అని పేర్కొంటూ ఇందులో ఆమె నవ్వులు పూయిస్తూ కనిపించింది. దీనికి 'ఇదొక మంచి ఉద్దేశంతో మొదలైంది' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ముఖ్యంగా ఆమె మెడపై టాటూ కనిపిం చకపోవడంపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 'వైఎంసీ (ఏమాయ చేసావె).. టాటూను సమంత తొలగించేశారా?' అని సందేహం వ్యక్తంచేశారు. అలా జరిగి ఉండకపోవచ్చని.. మేకప్ అది కని పించకుండా కవర్ చేసి ఉండొచ్చని మరికొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story