NT Rama Rao’s Lively Presence at Bavamaridi’s Wedding: బావమరిది పెళ్లిలో ఎన్టీఆర్ సందడి!
పెళ్లిలో ఎన్టీఆర్ సందడి!

NT Rama Rao’s Lively Presence at Bavamaridi’s Wedding: టాలీవుడ్ యువ నటుడు, 'మ్యాడ్' ఫేమ్ నార్నె నితిన్ శుక్రవారం రాత్రి ఓ ఇంటివాడయ్యారు. యువతి శివానీతో హైదరాబాద్ శివారులోని శంకర్‌పల్లిలో నితిన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు నితిన్ బావ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బావమరిది పెళ్లి కావడంతో తారక్ స్వయంగా అతిథులను ఆహ్వానిస్తూ, పెళ్లి పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు. గుబురు గడ్డంతో, స్టైలిష్ లుక్‌లో తారక్ కనిపించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
వధువు శివానీ, సీనియర్ నటుడు దగ్గుబాటి వెంకటేశ్ కుటుంబానికి బంధువు కావడంతో, ఈ వివాహం సినీ, రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
