NTR–Prashanth Neel’s Crazy Project: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ క్రేజీ ప్రాజెక్ట్.. మే 19న ఊచకోత గ్లింప్స్ లోడింగ్..
మే 19న ఊచకోత గ్లింప్స్ లోడింగ్..

NTR–Prashanth Neel’s Crazy Project: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రంపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం NTRNeel అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) కానుకగా, ఒక రోజు ముందే అంటే మే 19వ తేదీ అర్ధరాత్రి ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నారు.
ఐదు భాషల్లో గ్లింప్స్ ధమాకా
ఈ మెగా ప్రాజెక్ట్ టీజర్‌ను కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా, దేశవ్యాప్తంగా ఒకేసారి తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. ఐదు భాషల్లో ఒకేసారి రాబోతున్న ఈ టీజర్‌తో దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కొత్త స్టిల్..
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఒక కొత్త స్టిల్ నెట్టింట వైరల్‌గా మారింది. ఎడారి మధ్యలో ఒక వ్యక్తి చేతిలో కర్ర పట్టుకుని ఉన్న ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. "The calm before the ___. Rest you know what to fill in the blank." (___ముందు ప్రశాంతత... ఖాళీని మీరే పూరించండి
అంటూ చిత్రబృందం ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రశాంత్ నీల్ సృష్టించబోయే సరికొత్త యాక్షన్ ప్రపంచం ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ రకరకాలుగా ఊహించుకుంటూ చర్చలు మొదలుపెట్టారు.
హైప్ నెక్స్ట్ లెవెల్..
టాలీవుడ్ టాప్ మాస్ హీరో ఎన్టీఆర్, హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రాల కేరాఫ్ అడ్రస్ ప్రశాంత్ నీల్ కలయిక కావడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ భారీ వ్యాపారం జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.

