NTR’s Crazy Birthday Wishes: భారతీయ చలనచిత్ర రంగాన్ని తన మాస్ టేకింగ్‌తో సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో త్వరలోనే రాబోతున్న డ్రాగ‌న్ సినిమాను గుర్తుచేస్తూ ఎన్టీఆర్ పెట్టిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్‌గా మారింది.

కన్నడ పదంతో ఎన్టీఆర్ ట్వీట్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్

డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో తనకున్న ప్రత్యేక సాన్నిహిత్యాన్ని చాటుకుంటూ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు డైరెక్టర్ గారూ.. మీరు చెప్పే కథలంత గొప్పగా ఈ ఏడాది మీకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కాంబినేషన్‌లో రాబోయే ప్రాజెక్ట్ కోసం, మన భవిష్యత్తు ప్రయాణం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను ప్రశాంత్” అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు.

ఈ ట్వీట్‌లో ప్రశాంత్ నీల్‌ను ఉద్దేశించి ఎన్టీఆర్ కన్నడ పదంఅవరే (తెలుగులో గారూ అని అర్థం) అని సంబోధించడం విశేషం. ఈ ఒక్క పదంతో అటు తెలుగు, ఇటు కన్నడ చిత్రసీమల అభిమానులను ఎన్టీఆర్ ఎంతగానో ఆకట్టుకున్నారు.

డ్రాగన్ బాక్సాఫీస్ వేట.. జూన్ 11న రిలీజ్!

కేజీఎఫ్, సలార్ వంటి భారీ ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఎన్టీఆర్‌తో కలిసి ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేయగా, దీనిపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. థియేటర్లలో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఎన్టీఆర్ స్వయంగా ట్వీట్ చేయడంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story