Rita Revolver: రీటా రివాల్వర్ రిలీజ్ డేట్ ఫిక్స్
రిలీజ్ డేట్ ఫిక్స్

Rita Revolver: కీర్తిసురేశ్ పోలీసు అధికారి పాత్రలో వస్తున్న సినిమా రివాల్వర్ రీటా. ఈ సినిమాకు జేకే చండూరు దర్శకత్వం వహిస్తుండగా.. దీనిని ఫ్యాషన్ స్టూడియో నిర్మిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ చిత్రంలో రాధిక శర త్కుమార్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్లీ, సూపర్ సుబ్బరాయన్, జాన్ విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నా రు. అయితే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఇందులోంచి విడుదల అప్డేట్స్ అన్ని మంచి రెస్పాస్సును దక్కించుకున్నాయి. తాజాగా, కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఈ మూవీని ఆగస్టు 27న రాబోతున్నట్లు వెల్లడించింది. ఓ పోస్టర్ ను కూడా షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇందులో గ్రీన్ కలర్ చూడీదార్ ధరించి ఓ ట్రాలీబ్యాగ్ లో శవాన్ని పెట్టి దానిపై కూర్చొని ఉండగా.. వెనకాల ఒక కారు ఉంది. లేడీ డాన్ గా కనిపించి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు ఆమె పోస్టర్ అంచనాలను పెంచుతోందని అంటున్నారు. ఇందులో రీటా పాత్రలో తుపాకి పట్టుకొని సరికొత్తగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది కీర్తి. అనుకోని పరిస్థితుల్లో తుపాకీ చేతపట్టాల్సి వచ్చిన ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. సుధాన్ సుందరం, జగదీశ్ పళనిసామి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
