OG Director Sujeeth: నానితో ఓజీ డైరెక్టర్ సుజిత్ కొత్త సినిమా ప్రారంభం..
డైరెక్టర్ సుజిత్ కొత్త సినిమా ప్రారంభం..

OG Director Sujeeth: పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కించిన ఓజీ చిత్రం ఇటీవలే విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, దర్శకుడు సుజిత్ మాత్రం ఆలస్యం చేయకుండా తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించి సిద్ధమైపోయారు.
దసరా కానుకగా కొత్త మూవీ ప్రకటన
దసరా పండుగ సందర్భంగా సుజిత్ తన నెక్స్ట్ సినిమా వివరాలను వెల్లడించారు. ఈసారి ఆయన టాలీవుడ్ స్టార్ హీరో నానితో జతకట్టారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు దసరా రోజున ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
సుజిత్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను పంచుకోగా.. అవి నెట్టింట వైరల్ గా మారాయి. నానితో సుజిత్ కలయిక, కొత్త ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. 'ఓజీ' చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే, నానితో సుజిత్ చేయబోయే కొత్త సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు, ఇతర నటీనటులు ఎవరు అనే వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
