OG Collections: యూఎస్ ప్రీమియర్ సేల్స్ లో OG కలెక్షన్ల విధ్వంసం
OG కలెక్షన్ల విధ్వంసం

OG Collections: సుజీత్ డైరెక్షన్ లో వస్తోన్న 'ఓజీ' (OG) పై అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఓవర్సీస్ ప్రీమియర్ వసూళ్లలో ఓజీ సంచలనం సృష్టించింది. ఈ చిత్రం విడుదల కాకముందే భారీ కలెక్షన్లు రాబట్టింది. ఓజీ’ ప్రీమియర్ ప్రీ- సేల్స్ఉత్తర అమెరికా మార్కెట్‌లో ఊహించని రికార్డులు నింపింది. మొత్తం ఉత్తర అమెరికాలో అడ్వాన్స్ ప్రీ-సేల్స్ 9 లక్షల డాలర్లకి పైగా చేరింది. 400లకు పైగా లొకేషన్స్‌లో మొత్తం 32 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని వెల్లడించింది. .ప్రీమియర్ షోల వసూళ్లు కేవలం 22 గంటల్లోనే $1 మిలియన్ (దాదాపు రూ. 8.3 కోట్లు)కి పైగా వసూలు చేసింది.
పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే ఓవర్సీస్ ప్రీ-సేల్స్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.ఈ సినిమా నాన్-రాజమౌళి చిత్రాలలో రెండవ అత్యధిక ప్రీ-సేల్స్ రికార్డును సాధించింది. అత్యధిక ప్రీ-సేల్స్ రికార్డును 'పుష్ప 2' పేరిట ఉంది.
'ఓజీ' సినిమా సెప్టెంబర్ 27 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, ప్రియాంక మోహన్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా ముంబై గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందింది. ఇందులో పవన్ కళ్యాణ్ 'ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్'గా కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్, గ్లింప్స్ ,పోస్టర్ సినిమా హైప్ పెంచాయి.
