మనసంతా నువ్వే రీ రిలీజ్

“Manasantha Nuvve” Set for Re-Release: ప్రేమికుల రోజు (Valentine's Day) సందర్భంగా ఫిబ్రవరి 14న 'మనసంతా నువ్వే' సినిమాను భారీ ఎత్తున రీ-రిలీజ్ చేస్తున్నారు. 2001లో విడుదలై సంచలనం సృష్టించిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది.

ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించిన ఈ చిత్రానికి వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించారు. ఎం.ఎస్. రాజు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని 4K రిమాస్టర్డ్ వెర్షన్లో, అత్యాధునిక డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సౌండ్ క్వాలిటీతో అప్‌గ్రేడ్ చేసి విడుదల చేస్తున్నారు.పాతికేళ్ళ తర్వాత కూడా ఈ సినిమాలోని "తూనీగ తూనీగ" పాట ఆ సున్నితమైన ప్రేమకథ నేటి యువతను కూడా ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ సినమాతో ఉదయ్ కిరణ్ ఒక 'లవర్ బాయ్'గా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఆయన నటన, అమాయకత్వం ఈ పాత్రకు ప్రాణం పోశాయి. రీమా సేన్‌తో ఆయన కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. ఇతర భాషల్లో రీమేక్ ఈ సినిమా ఎంతటి ప్రభావాన్ని చూపిందంటే, దీనిని పలు భాషల్లో రీమేక్ చేశారు. హిందీలో జీనా సిర్ఫ్ మేరే లియే' (తుషార్ కపూర్, కరీనా కపూర్), కన్నడలో 'మనసెల్లా నీనే'

తమిళంలో 'మొగమన మనసుగా రీమేక్ చేశారు.

ఈ నెలలో రీ-రిలీజ్ అవుతున్న సినిమాల్లో 'మనసంతా నువ్వే' తో పాటు మరికొన్ని ప్రేమకథా చిత్రాలు కూడా ఉన్నాయి. అందులో ఫిబ్రవరి 6న 3 (త్రీ),7న ఆరెంజ్, లవ్ స్టోరీ (Love Story), ఏం మాయ చేసావే ఫిబ్రవరి 14న రీ రిలీజ్ కానున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story