వన్ బ్యాటిల్ సిక్సర్..

Oscar Celebration: ఆస్కార్ పండగ మొదలైంది.అవార్డుల ప్రదానోత్సవం ఇవాళ ఉదయం ఘనంగా జరిగింది. ప్రతిసారి 23 విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తారు. కానీ ఈసారి కొత్తగా బెస్ట్ కాస్టింగ్ అనే విభాగాన్ని ప్రవేశపెట్టారు. అలా ఈసారి 24 విభాగాల్లో అవార్డు లను ప్రదానం చేశారు. 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' మూవీకి అత్యధికంగా 6 పురస్కా రాలు వరించాయి. కార్యక్రమాన్ని ప్రముఖ హాస్యనటుడు కోసన్ ఓబ్రియన్ నిర్వహించా రు.

ఈ ఏడాది అవార్డుల్లో 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' చిత్రం ప్రధానంగా నిలిచింది. ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు మొత్తం ఆరు అవార్డులు గెలుచుకుంది. ఈ చిత్రానికి దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఇందులో నటించిన షాన్ పెన్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు. మరోవైపు 'సిన్నర్స్' చిత్రం కూడా నాలుగు అవార్డులు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో నటించిన మైకేల్ బి జోర్డన్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నా రు. ఇలా పలు విభాగాల్లో గెలిచిన చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం కేటగిరీలో రెండు చిత్రాలకు పురస్కారాలు వరించడం విశేషం! బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రంగా సెంటిమెంటల్ వాల్యూ'ని ప్రకటించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story