Anirudh: తమిళ స్టార్ నటుడు, సీఎ విజయ్‌తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రీల్ లైఫ్‌లో బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన ఈ కాంబినేషన్ ఇకపై వెండితెరపై కనిపించకపోవచ్చనే వార్తల నేపథ్యంలో అనిరుధ్ స్పందన అభిమానులను ఆకట్టుకుంటోంది. విజయ్, అనిరుధ్ కాంబినేషన్‌లో వచ్చిన కత్తి, మాస్టర్, బీస్ట్, లియో’

చిత్రాలు మ్యూజికల్‌గా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ చివరి చిత్రంగా ప్రచారం పొందుతున్న ‘జన నాయగన్’ చిత్రానికి కూడా అనిరుధే సంగీతం అందించారు.

అనిరుధ్ భావోద్వేగ పోస్ట్ – ముఖ్యాంశాలు..

మధురమైన ప్రయాణం: విజయ్‌తో కలిసి పనిచేసిన సమయం అత్యంత మధురమైనదని, ఎన్నో భావోద్వేగాలతో నిండి ఉందని అనిరుధ్ పేర్కొన్నారు.

నమ్మకానికి కృతజ్ఞతలు:

"మీతో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. నాపై మీరు ఉంచిన అపారమైన నమ్మకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి" అని రాసుకొచ్చారు.

అమరమైన సంగీతం: "మన కాంబినేషన్‌లో వచ్చిన సంగీతం ఎప్పటికీ ప్రజల గుండెల్లో జీవించే ఉంటుంది" అంటూ విజయ్‌తో ఉన్న ఒక ప్రత్యేకమైన ఫోటోను అనిరుధ్ అభిమానులతో పంచుకున్నారు.

జన నాయగన్ విశేషాలు..

రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టిన తర్వాత విజయ్ నటించిన తొలి చిత్రం మరియు ఆయన సినీ కెరీర్‌లో చివరి చిత్రంగా భావిస్తున్న 'జన నాయగన్'పై భారీ అంచనాలు ఉన్నాయి.తెలుగు బ్లాక్‌బస్టర్ 'భగవంత్ కేసరి'కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాబీ డియోల్, పూజా హెగ్డే, మమితా బైజూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వెండితెరపై విజయ్ – అనిరుధ్ లవ్లీ కాంబినేషన్ ముగిసినప్పటికీ, వారి అందించిన చార్ట్‌బస్టర్ పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story