Exhibitors Fire Back at Producers: టాలీవుడ్‌లో పర్సంటేజీ వార్ ముదురుతోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పూర్తిస్థాయి పర్సంటేజీ విధానం అమలు చేయాలన్న ఎగ్జిబిటర్ల డిమాండ్.. ఇప్పుడు నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్ల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ప్రెస్‌మీట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సందర్భంగా ఛాంబర్ కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ.. పర్సంటేజీ విధానం కోసం తాము 2008 నుంచి పోరాడుతున్నామని గుర్తు చేశారు. గత ఏడాది చర్చలు జరుపుతామని చెప్పిన నిర్మాతలు, నెలలు గడుస్తున్నా స్పందించకపోవడం వల్లే తాము మళ్లీ గళం విప్పాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అనవసరంగా ఈ వివాదంలోకి ‘పెద్ది’ సినిమా ప్రస్తావన తీసుకురావద్దని, కొందరు నిర్మాతలు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని, మే 15న జరిగే సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని శ్రీధర్ వెల్లడించారు.

మరోవైపు నిర్మాత సి.కల్యాణ్ స్పందిస్తూ.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ ఒకే కుటుంబమని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత దూషణలు పక్కన పెట్టి, ప్రేక్షకుడికి సినిమాను ఎలా చేరువ చేయాలనే అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇవాళ ఫిల్మ్ ఛాంబర్‌లో జరగబోయే భేటీతో ఈ సమస్య పరిష్కారానికి తొలి అడుగు పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఇవాళ కీలక సమావేశంలో టాలీవుడ్ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఈ పర్సంటేజీ రగడకు ముగింపు పడుతుందో లేదో వేచి చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story