Pa. Ranjith’s Film: ఆస్కార్ కు.. పా. రంజింత్ సినిమా
పా. రంజింత్ సినిమా

Pa. Ranjith’s Film: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత ప్రొడ్యూసర్ గా పాపా బుకా' (Papa Buka) అనే చిత్రం 98వ అకాడమీ అవార్డుల (ఆస్కార్స్) కోసం ఎంట్రీ సాధించింది. అయితే, ఈ చిత్రం భారత్ తరపున కాకుండా పపువా న్యూ గినీ దేశం తరపున ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీ పడనుంది. పపువా న్యూ గినీ నుంచి ఆస్కార్ కు ఎంపికైన తొలి చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. అలాగే, ఒక భారతీయ దర్శకుడు రూపొందించిన సినిమా వేరే దేశం తరపున ఆస్కార్ కు ఎంపిక కావడం ఇదే మొదటిసారి.
జాతీయ అవార్డు గ్రహీత మలయాళ డైరెక్టర్ డా. బిజుకుమార్ దామోదరన్ డైరెక్షన్ లో ఈ మూవీ వచ్చింది. ఈ చిత్రం భారత్ ,పపువా న్యూ గినీ దేశం నుంచి నోయెలెన్ .. పా.రంజిత్ తో కలిసి నిర్మించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో పపువా న్యూ గినీలో పోరాడిన భారతీయ సైనికుల కథను ఈ చిత్రం వివరిస్తుంది. ఈ సినిమాలో భారతీయ నటులు కూడా నటించారు.ఈ సినిమా సెప్టెంబరు 19న విడుదల కానుంది.
తన నిర్మాణ సంస్థ 'నీలం ప్రొడక్షన్స్ గర్వించ దగ్గ విషయమని పా రంజిత్ ఆనందం వ్యక్తం చేశాడు. పాపువా న్యూ గినీ సినిమాకు ఇది చారిత్రాత్మక క్షణం అని చెప్పాడు. భారతదేశం నుంచి నిర్మాతలలో ఒకరిగా రెండు దేశాల సహ నిర్మాణంలో భాగం కావడం నీల్ ప్రొడక్షన్ కి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు.
