Parineeti Chopra: పండంటి మగబిడ్డ జన్మనిచ్చిన పరిణీతి చోప్రా
మగబిడ్డ జన్మనిచ్చిన పరిణీతి చోప్రా

Parineeti Chopra: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దా దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించారు. తమ జీవితంలోకి కొత్త వ్యక్తి రావడాన్ని ఈ దంపతులు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, శ్రేయోభిలాషులతో పంచుకున్నారు. "చివరకు మా బేబీ బాయ్ వచ్చేశాడు! ఇప్పుడు మాకు అంతకుముందు జీవితం ఎలా ఉండేదో కూడా గుర్తుకు రావడం లేదు. చేతులు నిండుగా, మా హృదయాలు మరింత నిండుగా ఉన్నాయి. మొదట మాకు ఒకరికొకరం మాత్రమే ఉన్నాం, ఇప్పుడు మాకు అన్నీ ఉన్నాయి. కృతజ్ఞతతో, పరిణీతి & రాఘవ్. అని తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, వారు ఇలా రాసుకొచ్చారు: ఈ శుభవార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. పరిణీతి కజిన్ అయిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా 2023 సెప్టెంబర్ 24న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. పెళ్లైన సుమారు రెండేళ్లకు ఈ దంపతులు తల్లిదండ్రులుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.
