Pawan Kalyan: ఖుషీ తర్వాత మళ్లీ అంతటి జోష్...ఈ సినిమాను ఇంతలా ప్రేమిస్తానని అనుకోలే
ఈ సినిమాను ఇంతలా ప్రేమిస్తానని అనుకోలే

Pawan Kalyan: ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగింది. వర్షం రావడంతో అర్థాంతరంగా ముగిసింది. వర్షంలోనే పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. అభిమానుల్ల జోష్ నింపారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సుజిత్ కథ చెప్పేటప్పుడు చాలా తక్కువగా, ముక్కలు ముక్కలుగా చెప్తాడని, కానీ సినిమా తీసేటప్పుడు మాత్రం తన పూర్తి విజన్‌ను తెరపై అద్భుతంగా చూపిస్తాడని పవన్ అన్నారు."నేను ఈరోజు డిప్యూటీ సీఎం అనే విషయాన్ని మర్చిపోయాను. ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకొని వస్తే ఎవరైనా ఊరుకుంటారా? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది" అంటూ సెటైర్ వేశారు. సుజీత్ కు అద్భతమైన టీం ఉందని..అలాంటి టీం తనకుంటే రాజకీయాల్లోకి వచ్చేవాన్ని కాదన్నారు పవన్ . దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు సుజిత్ గురించి చెప్పారని, ఆయన సిఫార్సుతోనే ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరించానని పవన్ తెలిపారు.
భారీ వర్షం పడుతున్నా వేలాది మంది అభిమానులు తమ స్థలాలను వీడకుండా తన ప్రసంగం కోసం ఎదురుచూడటం చూసి పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. వర్షాన్ని లెక్క చేయకుండా వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు."నేను రాజకీయాల్లోకి వెళ్లినా నన్ను మీరు వదల్లేదు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేస్తున్నానంటే దానికి మీరే కారణం" అంటూ అభిమానుల అంకితభావం గురించి మాట్లాడారు.
సినిమాలో ఒక కీలక సందర్భంలో వచ్చే 'వాషి యో వాషి' అనే జపనీస్ సంభాషణను పవన్ స్వయంగా చెప్పి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ చిత్రంలో విలన్‌గా నటించిన ఇమ్రాన్ హష్మీ అద్భుతమైన నటుడని, ఆయనతో కలిసి పనిచేయడం మంచి అనుభవమని తెలిపారు. చాలా కాలం తర్వాత 'ఖుషి' సినిమా రోజుల్లో చూసిన ఉత్సాహం మళ్లీ ఇప్పుడు కనిపిస్తోందని పవన్ అన్నారు.
ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ సినిమాలో వాడిన డ్రెస్సింగ్, కటానా కత్తితో రావడమే కాకుండా, శివమణి డ్రమ్స్ వాయిస్తుండగా స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు.
