ఉస్తాద్ క్లైమాక్స్ కంప్లీట్

'Ustaad' Climax Completed: హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ మూవీపై అంచనాలున్నాయి.

పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూనే వీలైనపుడు సినిమా షూటింగ్‌లు చేస్తున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా క్లైమాక్స్ షూట్‌ను ఇటీవలే పూర్తి చేశారు. భావోద్వేగాలు, యాక్షన్ కలగలిసిన ఈ క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని చిత్ర బృందం తెలిపింది.

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, హరిహర వీరమల్లు ప్రమోషన్స్, OG సినిమా షూటింగ్ మధ్య కూడా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ను పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తి చేయడం ఆయన అంకితభావానికి నిదర్శనమని మేకర్స్ ప్రశంసించారు. క్లైమాక్స్ షూట్ పూర్తవడంతో, సినిమా దాదాపుగా పూర్తయినట్టే. కొన్ని చిన్నపాటి ప్యాచ్ వర్క్‌లు, పాటల చిత్రీకరణ మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని , వై. రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోలీస్ డ్రామా నేపథ్యంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story