చరణ్ ఊరమాస్ స్టెప్పులు

Charan Impresses with Mass Dance Moves: రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న 'పెద్ది' సినిమాలోని 'చికిరి చికిరి' పాట విడుదల అయింది.ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ను మోహిత్ చౌహాన్ పాడగా..బాలాజీ లిరిక్స్ రాశారు.

ఆస్కార్ గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ నుంచి వచ్చిన మాస్ బీట్స్ ,బీజీఎం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. రామ్ చరణ్ ఊర మాస్ లుక్‌లో వేసిన హుక్ స్టెప్ (ముఖ్యంగా 'బీడీ' స్టెప్ అని ఫ్యాన్స్ పిలుస్తున్నారు) చాలా వైరల్ అవుతోంది. కొందరు ఫ్యాన్స్ ఆయన గ్రేస్‌ను చిరంజీవి గారి 'ముఠా మేస్త్రి'లోని స్టెప్పులతో పోలుస్తున్నారు. రామ్ చరణ్ స్టెప్పులు, జాన్వీ కపూర్ గ్లామర్ హైలైట్‌గా ఉన్నాయి.

'చికిరి' అంటే డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన దాని ప్రకారం.. ఇది విజయనగరం ప్రాంతీయ యాసలో ఒక అమ్మాయిని అందంగా, అలంకరణ అవసరం లేని అమ్మాయిని ప్రేమతో పిలిచే పదం. సినిమా కథానాయకుడు (పెద్ది) హీరోయిన్ (అచ్చియమ్మ)ను మొదటిసారి చూసినప్పుడు ఆమె అందాన్ని వర్ణించే సందర్భంలో ఈ పాట వస్తుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా 2026 మార్చి 27న విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story