Peddi Creates a Box Office Tsunami: పెద్ది బాక్సాఫీస్ సునామీ.. 9 రోజుల్లోనే రూ. 366 కోట్ల కలెక్షన్లతో చరణ్ రికార్డు..
9 రోజుల్లోనే రూ. 366 కోట్ల కలెక్షన్లతో చరణ్ రికార్డు..

Peddi Creates a Box Office Tsunami: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చిన నాటి నుండి కలెక్షన్ల వేటను దిగ్విజయంగా కొనసాగిస్తోంది. విడుదలైన కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 366 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. ఈ అద్భుతమైన కలెక్షన్ల వివరాలను నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారిక పోస్టర్ ద్వారా స్పష్టం చేసింది.
2026 సౌత్ ఇండియా బిగ్గెస్ట్ గ్రాసర్‌గా పెద్ది
ఈ నెల 4న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో విడుదలైన పెద్ది చిత్రం, ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా థియేటర్లలో రికార్డుల పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు సాధించిన వసూళ్లతో 2026 సంవత్సరంలో సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ గ్రాసర్‌గా ఈ సినిమా నిలిచిందని చిత్రబృందం గర్వంగా ప్రకటించింది.
ప్రస్తుతం శని, ఆదివారాలు కావడంతో ఈ రెండు రోజుల్లో పెద్ది కలెక్షన్ల గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో.. వృద్ధి సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడమే కాకుండా ఈ భారీ విజయంలో కీలక పాత్ర పోషించాయి.

