‘Peddi’ Creates a Collection Tsunami: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లోబల్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద అన్‌స్టాపబుల్ రన్‌తో దూసుకుపోతోంది. థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా.. వీకెండ్‌లో కలెక్షన్ల విధ్వంసం సృష్టించింది. విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల క్లబ్‌ను దాటేసి సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది.

ఈ ఘన విజయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ మాస్ పోస్టర్‌ను విడుదల చేసింది. "బాక్సాఫీస్ ఛాంపియన్ ‘పెద్ది’ అన్‌స్టాపబుల్.. గ్లోబల్ వైడ్‌గా ఈ చిత్రం మూడు రోజుల్లో రూ. 236.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది" అని మేకర్స్ ప్రకటించారు. ఆదివారం సెలవు దినం కావడం ఈ సినిమాకు భారీగా కలిసివచ్చిందని, లాంగ్ రన్‌లో ఈ కలెక్షన్ల జోరు మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కథను వందకు వంద శాతం ఆవిష్కరించాను: దర్శకుడు బుచ్చిబాబు

సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై దర్శకుడు బుచ్చిబాబు సానా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. "రామ్ చరణ్ గారి నటనను థియేటర్లలో చూసి ప్రేక్షకులు, అభిమానులు మెచ్చుకుంటుండటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. నేను పేపర్‌పై ఏ కథనైతే రాసుకున్నానో.. దాన్ని వందకు వంద శాతం తెరపై ఆవిష్కరించగలిగాను. దానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే గర్వంగా ఉంది" అని బుచ్చిబాబు అన్నారు.

సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో హ్యాట్రిక్ మూవీ?

మరోవైపు ఉప్పెన, ఇప్పుడు పెద్ది చిత్రాలతో వరుసగా రెండు భారీ బ్లాక్‌బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న బుచ్చిబాబు.. తన కెరీర్‌లో హ్యాట్రిక్ మూవీని ఏ స్టార్ హీరోతో చేయబోతున్నారనే ఆసక్తి టాలీవుడ్‌లో నెలకొంది. ఈ క్రమంలో ఆయన తన తదుపరి చిత్రాన్ని సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో ప్లాన్ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై స్పందిస్తూ ఇండస్ట్రీలో వస్తున్న వార్తలను అంగీకరించారు. "అవునండీ.. మహేశ్‌బాబు గారితో తర్వాతి సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. అయితే దీనిపై పూర్తి క్లారిటీ రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది" అని బుచ్చిబాబు అఫీషియల్‌గా హింట్ ఇచ్చారు. మొత్తానికి రామ్ చరణ్ పెద్ది సక్సెస్‌తో మెగా అభిమానులు పండగ చేసుకుంటుండగా.. బుచ్చిబాబు-మహేష్ బాబు కాంబో వార్తలతో సూపర్‌స్టార్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story