‘Peddi’ Creates: పెద్ది నార్త్ అమెరికా ప్రీమియర్ కలెక్షన్ల సునామీ
ప్రీమియర్ కలెక్షన్ల సునామీ

‘Peddi’ Creates: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సరికొత్త యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా “పెద్ది” మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కానుండగా.. దాదాపు అదే సమయానికి నార్త్ అమెరికాలోనూ ప్రీమియర్ ప్రదర్శనలు మొదలుకానున్నాయి.
సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండటంతో, అందరూ ఊహించినట్లుగానే రామ్ చరణ్ నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ వృద్ధిని నమోదు చేస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ సేల్స్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 1.1 మిలియన్ డాలర్ల (దాదాపు 9 కోట్లకు పైగా) మైలురాయిని అత్యంత సులువుగా దాటేసింది. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఒక సోలో హీరోగా నార్త్ అమెరికా మార్కెట్లో సాధించిన బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇవే కావడం విశేషం.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" చిత్రం నార్త్ అమెరికాలో దీనికంటే చాలా పెద్ద మొత్తంలో వసూళ్లను సాధించినప్పటికీ.. అది ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలయికలో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం. ఒక సోలో హీరోగా చూసుకుంటే మాత్రం, రామ్ చరణ్ కెరీర్‌లో నార్త్ అమెరికాలో ఇదే అత్యుత్తమ మరియు సరికొత్త రికార్డ్ ఓపెనింగ్ అని చెప్పాలి. గంటగంటకూ ఈ సినిమాపై అంచనాలు మరియు క్రేజ్ విపరీతంగా పెరుగుతుండటంతో.. ఈ పాజిటివ్ మొమెంటం రాబోయే వీకెండ్ లోనే కాకుండా ఆ తర్వాత కూడా ఇలాగే కొనసాగుతుందని చిత్రబృందం ఎంతో ధీమాగా ఉంది.

