Peddi Day 1 Collections: మొదటి రోజే రూ. 100 కోట్ల క్లబ్‌లో పెద్ది
రూ. 100 కోట్ల క్లబ్‌లో పెద్ది

Peddi Day 1 Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన విశ్వరూపం చూపించారు! మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో.. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో రికార్డుల వేట మొదలుపెట్టింది. భారీ అంచనాల మధ్య జూన్ 4న విడుదలైన ఈ చిత్రం, తొలి రోజే బాక్సాఫీస్ వద్ద మునుపెన్నడూ లేని విధంగా సంచలన ఆరంభాన్ని నమోదు చేసింది!
ప్రపంచవ్యాప్తంగా వేలాది స్క్రీన్లలో విడుదలైన ‘పెద్ది’.. మొదటి రోజే ట్రేడ్ వర్గాల అంచనాలను తలకిందులు చేసింది. బుధవారం రాత్రి జరిగిన ప్రీమియర్ షోల నుంచే సాలిడ్ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం.. తొలిరోజు భారతదేశంలో ఏకంగా రూ. 69.50 కోట్ల నికర (Net) వసూళ్లను సాధించింది. ఇక దేశీయంగా గ్రాస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. కేవలం ఇండియాలోనే రూ. 82.49 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసి రామ్ చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.
కేవలం ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ‘పెద్ది’ హవా గట్టిగా నడుస్తోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా సహా విదేశీ మార్కెట్లలో రామ్ చరణ్ యాక్టింగ్‌కు, బుచ్చిబాబు ఎమోషనల్ టేకింగ్‌కు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఓవర్సీస్‌లో మొదటి రోజే సుమారు రూ. 30 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. దీంతో.. ఇండియా, ఓవర్సీస్ అన్నీ కలిపి తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 112.49 కోట్ల భారీ గ్రాస్ కలెక్షన్లను సాధించి ‘పెద్ది’ సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఈ అద్భుతమైన వసూళ్లతో.. మొదటి రోజే రూ. 100 కోట్ల మార్క్‌ను దాటిన అతికొద్ది తెలుగు సినిమాల క్లబ్‌లో ‘పెద్ది’ స్థానం సంపాదించుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా వన్డే వరల్డ్ రికార్డ్ లెవెల్ ఓపెనింగ్స్ రాబట్టడం మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ చూస్తుంటే.. ఈ వీకెండ్‌లో మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

