Peddi Item Song Alert: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. సినిమాలో ఒక అదిరిపోయే స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ పాటలో చరణ్‌తో కలిసి డాన్స్ చేయడానికి శర్వరీ వాఘ్ వంటి బాలీవుడ్ భామను తీసుకురావాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అయితే సినిమాకు గ్లామర్ పెరుగుతుందని, పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ వస్తుందని వాళ్ల నమ్మకం. కానీ, డైరెక్టర్ బుచ్చిబాబు మాత్రం మాజీ మిస్ ఇండియా మానస వారణాసిని తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి మరి!

మరోవైపు, సినిమా విడుదల విషయంలో వినిపిస్తున్న వార్తలు ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చడం లేదు. నిజానికి ఏప్రిల్ 30న సినిమా రావాల్సి ఉంది. కానీ, షూటింగ్ ఆలస్యం వల్ల రెండోసారి కూడా సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ మౌనంగా ఉండటంతో అభిమానులు బాగా నిరాశ చెందుతున్నారు.

సినిమా వాయిదా పడుతుందా లేదా అనే విషయంలో ప్రొడక్షన్ టీమ్ ఇప్పటివరకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఈ సైలెన్స్ చూసి ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మేకర్స్ వెంటనే స్పందించి అసలు విషయం ఏంటో చెప్పాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంచనాలు భారీగా ఉన్న ఈ సినిమాపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story