'Peddi' movie: రామ్ చరణ్ పెద్ది సినిమా వాయిదా..నిజమేనా.?
నిజమేనా.?

'Peddi' movie: రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' (Peddi) సినిమా వాయిదా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో,సినీ వర్గాల్లో గందరగోళం నెలకొంది. చిత్ర బృందం గతంలో ఈ సినిమాను 2026 మార్చి 27న (రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా) విడుదల చేస్తామని ప్రకటించింది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలలో కూడా రామ్ చరణ్ ఇదే తేదీని ధృవీకరించారు.
అయితే షూటింగ్ ఇంకా కొంత భాగం బ్యాలెన్స్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల దృష్ట్యా సినిమా మే లేదా జూన్ నెలకు వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను అదే మార్చి 27వ తేదీన విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని, అందుకే రామ్ చరణ్ తన సినిమాను వెనక్కి జరిపారనే టాక్ కూడా నడుస్తోంది.
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.ఇటీవల విడుదలైన "చికిరి చికిరి" పాట సోషల్ మీడియాలో భారీ వ్యూస్‌తో దూసుకుపోతోంది.రామ్ చరణ్ ఈ సినిమా కోసం పూర్తి రగ్గడ్ లుక్‌లోకి మారి కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు.
ప్రస్తుతం చిత్ర యూనిట్ మార్చి 27 తేదీకే కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, షూటింగ్ పెండింగ్ ఉండటం వల్ల అధికారికంగా వాయిదా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

