యాక్షన్ సీన్స్..

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బు చ్చిబాబు తెరకెక్కిస్తోన్న అనైటెడ్ భారీ చిత్రమే 'పెద్ద' జాన్వీ కపూర్ హీరోయిన్ గా... శివరాజ్ కుమార్, జగపతిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి ఫస్ట్ షాట్ తోనే భారీ అంచనాలు అందుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ ట్రైన్ సెట్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సినీవర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి వైరలవుతోంది.

భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకూ ఎవరూ చేయనటువంటి హైరిస్క్ యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫైట్ మాస్టర్ నభాకాంత్ నేతృత్వంలో ఈ మొత్తం ఎపిసోడ్ వేరే లెవెల్ లో ఉంటుందట. బిగ్ స్క్రీన్స్ పై ఈ సన్నివేశం ఆడియెన్స్ కి గట్టి ట్రీట్ ఇస్తుందని టాక్. గతంలో ఫైట్ మాస్టర్ నభాకాంత్ పుష్ప మూవీకి పనిచేశారు.

ఇక ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అం దిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లోగా ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలనే లక్ష్యంతో చరణ్, బుచ్చిబాబు ఉన్నట్టు సమాచారం. వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న 'పెద్ద' మూవీని వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొ చ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story