పెద్ది సాంగ్

Peddi : రామ్ చరణ్ నటిస్తోన్న 'పెద్ది' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనుందని టాక్. సెప్టెంబర్ 25న వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ పాటను విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో, ఈ పాటపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇది ఇలా ఉంటే పెద్ది' సినిమాలోని రెండో షూటింగ్ కోసం సినిమా యూనిట్ శ్రీలంకకు వెళ్లినట్లు తెలుస్తోంది. పాటను శ్రీలంకలోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారంట. ఈ పాట కోసం హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్ ఇద్దరూ శ్రీలంక వెళ్లారు.
ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు సానా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పెద్ది గ్రామీణ నేపథ్యంలో జరిగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది.ఈ సినిమాలో జగపతి బాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది.
