‘Peddi’ Trailer Blast on May 18: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది! ‘ఉప్పెన’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వేటకు సిద్ధమైంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ డోస్ పెంచేశారు.

అభిమానులు ఎన్నో నెలలుగా కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. ‘పెద్ది’ అఫీషియల్ ట్రైలర్‌ను మే 18న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చరణ్ లుక్ చూస్తుంటే థియేటర్లలో మెగా అభిమానులకు పూనకాలు గ్యారెంటీ అనిపిస్తోంది.

ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, ఫస్ట్ షాట్ టీజర్ మరియు ‘ఫ్రైల్వాన్’ గ్లింప్స్ యూట్యూబ్‌లో రికార్డులను తిరగరాశాయి. ముఖ్యంగా ఈ సినిమాలో చరణ్ మేకోవర్, ఆ బాడీ లాంగ్వేజ్ గ్లోబల్ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ పీరియాడిక్ డ్రామాలో చరణ్ ఒక పవర్‌ఫుల్ మల్లయోధుడిగా కనిపించబోతుండటం సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది.

ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా.. రామ్ చరణ్ కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూన్ 4న గ్లోబల్ స్టార్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి రెడీ అయిపోయారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story