పెళ్లి వార్తలపై త్రిష ఘాటు స్పందన!

Trisha’s Sharp Response to Marriage Rumors: దక్షిణాది అగ్ర కథానాయిక త్రిష కృష్ణన్ మరోసారి తన పెళ్లి వార్తలపై ఘాటుగా స్పందించారు. చండీగఢ్‌కు చెందిన ఒక వ్యాపారవేత్తతో త్వరలోనే ఆమె వివాహం జరగనుందంటూ కొద్ది రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వ్యంగ్యంగా స్పందించారు. "నా జీవితాన్ని నా కోసం ప్లాన్ చేస్తున్న వాళ్లను నేను ప్రేమిస్తాను. ఇక వాళ్లే నా హనీమూన్ షెడ్యూల్ కూడా ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎదురుచూస్తున్నాను" అంటూ సెటైర్ వేశారు.

ఈ ఒక్క పోస్ట్‌తో తన పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని త్రిష స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'విశ్వంభర'తో సహా పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 2015లో ఒక వ్యాపారవేత్తతో జరిగిన తన నిశ్చితార్థం రద్దయిన తర్వాత, వ్యక్తిగత జీవితం కంటే కెరీర్‌కే ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story