అవతార్ 3 నుంచి మరో ట్రైలర్

Avatar 3: జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన 'అవతార్' సిరీస్ నుంచి మూడో భాగం, 'అవతార్: ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ విడుదలైంది. రెండు నెలల క్రితం అవతార్ 3 మొదటి ట్రైలర్ రిలీజ్ అయింది. తాజాగా అవతార్ 2 రెండో ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ తెలుగుతో సహా పలు భారతీయ భాషల్లో రిలీజ్ అయ్యింది. ట్రైలర్ లో ఈసారి కామెరూన్ 'యాష్ పీపుల్' (Ash People) అనే కొత్త గిరిజన తెగను పరిచయం చేశారు. వీరు అగ్నిని ఆరాధించేవారు, మరింత దూకుడుగా ఉంటారని ట్రైలర్‌లో చూపించారు. ఈ మూడో భాగం కూడా అద్భుతమైన విజువల్ వండర్‌గా ఉంటుందని ట్రైలర్ స్పష్టం చేసింది. ఈసారి పండోరా ప్రపంచంలో అగ్నిపర్వతాల నేపథ్యంలో కథ నడుస్తుంది.

ఈ చిత్రం ఈ చిత్రం ముందుగా సెప్టెంబర్ 2024లో విడుదల కావాల్సి ఉంది. కానీ పోస్ట్-ప్రొడక్షన్ పనుల కారణంగా డిసెంబర్ 19, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఫైనల్ విడుదలకు ముందు మరో ట్రైలర్ కూడా రావచ్చు. మరో వైపు అవతార్ 2 ఇండియాలో రీరీలీజ్ కానుంది. అక్టోబర్ 2 నుంచి నాలుగురోజుల పాటు త్రీడీ వెర్షన్ లో రిలీజ్ చేయనున్నారు. 2029లో అవతార్ 4, 2031లో అవతార్ 5 రిలీజ్ కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story