Pooja Bhatt: సింగిల్ లైఫ్ బాగుంది! విడాకులపై పూజా భట్ షాకింగ్ కామెంట్స్.
విడాకులపై పూజా భట్ షాకింగ్ కామెంట్స్.

Pooja Bhatt: బాలీవుడ్‌లో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నటిగా పేరు తెచ్చుకున్న పూజా భట్.. ఎప్పుడూ తన మనసులో మాటను నిర్మొహమాటంగా చెబుతుంటారు. ఆలియా భట్ సోదరిగా కంటే, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూజా.. తాజాగా తన పర్సనల్ లైఫ్ , విడాకుల తర్వాత తన జీవనశైలి గురించి కొన్ని సంచలన విషయాలను పంచుకున్నారు.
తన ప్రేమ జీవితం గురించి మాట్లాడుతూ.. తాను కేవలం 16 ఏళ్ల వయసు నుంచే రిలేషన్‌షిప్స్‌లో ఉన్నానని పూజా భట్ వెల్లడించారు. 2003లో మనీశ్ మఖీజాను వివాహం చేసుకున్న ఆమె, 2014లో విడాకులు తీసుకుని ఆ బంధం నుంచి బయటకు వచ్చారు. దాదాపు దశాబ్దం కాలం పాటు వైవాహిక జీవితంలో ఉన్న పూజా.. విడాకుల తర్వాత ఇప్పుడు అత్యంత స్వేచ్ఛగా, ప్రశాంతంగా బతుకుతున్నానని గర్వంగా చెబుతున్నారు.
వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ.. 50 ఏళ్లు దాటిన తర్వాత తనకు జిమ్‌కు వెళ్లడం అలవాటైందని ఆమె తెలిపారు. ఇప్పుడు ఆ జిమ్ తనకు ఒక దేవాలయం (Temple) లాంటిదని, ఫిట్‌నెస్ తన జీవితంలో ఒక భాగమైపోయిందని పేర్కొన్నారు. గతంలో కంటే ఇప్పుడు మరింత ఎనర్జిటిక్‌గా, హెల్దీగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సింగిల్ లైఫ్‌ను తాను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నానని పూజా వెల్లడించారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సౌత్ స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ కూడా ఇటీవల ఇంచుమించు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సింగిల్ లైఫ్‌లో ఉండే స్వేచ్ఛ, తనపై తాను దృష్టి పెట్టుకునే అవకాశం వేరే దేనిలోనూ ఉండదని ఆమె కూడా అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరు తారలు తమ వ్యక్తిగత జీవితాల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

