Pooja Hegde: మీరంతా డ్యాన్స్ చేయడం పక్కా.. పూజా హెగ్డ్ ఆసక్తికర పోస్ట్
పూజా హెగ్డ్ ఆసక్తికర పోస్ట్

Pooja Hegde: రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న సినిమా కూలీ. ఈ సినిమాలో పూజా హెగ్డ్ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. మోనికా బెల్లూచి అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. పూజాహెగ్దే, సౌబిన్ షాహిర్ డ్యాన్స్ కు సినీప్రియులు ఫిదా అయ్యారు. ఈ పాటకు మంచి ఆదరణ వస్తోంది. దీనిపై పూజాహెగ్గే ఆసక్తికర పోస్ట్ పెట్టారు. దీనిని ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. మోనికాపై మీ ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. ఆమె తన పోస్ట్‌లో ఈ పాట తన కెరీర్‌లో అత్యంత శారీరకంగా కఠినమైన, డిమాండింగ్‌తో కూడిన పాటలలో ఒకటి అని పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో తీవ్రమైన వేడి, ఎండ వల్ల కలిగే ట్యాన్, తేమ, దుమ్ము, బొబ్బలు, ఎంతో శక్తిని కోరే డ్యాన్స్ స్టెప్పులు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా, మోకాలికి లిగమెంట్ టియర్ అయిన తర్వాత ఇంతటి భారీ డ్యాన్స్ షూట్ చేయడం ఇదే మొదటిసారి అని కూడా చెప్పారు. ఇవన్నీ ఎదుర్కొంటూనే, పాట తెరపై గ్లామరస్‌గా మరియు సులభంగా కనిపించేలా చేయడం చాలా కీలకం అని, దానికి తాను వంద శాతం కృషి చేశానని పూజా హెగ్డే వెల్లడించారు. తాను మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి కూడా ఈ పాట షూటింగ్‌లో పాల్గొన్నానని పేర్కొన్నారు. ఈ కష్టమైన పనిలో తనతో పాటు నిలబడిన మరియు శక్తినిచ్చిన డ్యాన్సర్లకు పూజా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాట థియేటర్లలో చూసేటప్పుడు అభిమానులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని ఆమె తెలిపారు.
