Pooja Hegde: సౌత్, బాలీవుడ్ సినిమాలకు తేడా ఇదే..
సినిమాలకు తేడా ఇదే..

Pooja Hegde: ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో పూజా హెగ్డే సౌత్ , బాలీవుడ్ సినిమాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నాకు ఎప్పుడూ బలమైన పాత్రలు ఇవ్వలేదు, ఎక్కువగా గ్లామరస్ రోల్స్‌నే చూసింది. కానీ, సౌత్ సినిమా నాకు సవాలుతో కూడిన పాత్రలను అందించింది. నా ఇటీవల సినిమా 'రెట్రో'లో నేను పోషించిన పాత్ర నా నటనకు మంచి గుర్తింపు తెచ్చింది," అని ఆమె అన్నారు. అలాగే అరవింద సమేత' వంటి తెలుగు సినిమాలలో తన పాత్రలకు భావోద్వేగ లోతు ఉందని ఆమె తెలిపారు. ఒకవేళ బాహుబలి 3 సినిమా వస్తే, అందులో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం ఇవ్వమని నేను అడుగుతాను అని ఆమె నవ్వుతూ అన్నారు.
నెగిటివ్ ట్రోల్స్‌పై స్పందన
సోషల్ మీడియాలో తనపై వచ్చే నెగిటివ్ ట్రోల్స్ గురించి పూజా హెగ్డే తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "నాపై నెగిటివ్ ప్రచారం మొదలైనప్పుడు మా అమ్మ చాలా బాధపడింది. కానీ, నేను దాన్ని ఒక ప్రశంసగా తీసుకుంటాను. ఎందుకంటే, ఎవరైనా మిమ్మల్ని కించపరచాలని చూస్తే, మీరు వారికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నారని అర్థం అని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో కనిపించేవారంతా నిజమైన వ్యక్తులు కాదని, సినిమా కోసం టికెట్లు కొని చూసేవారే తనకు ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు.
కూలీ చిత్రంలోని మోనికా' పాట
తాను నటించిన 'కూలీ' సినిమాలోని 'మోనికా' పాట గురించి మాట్లాడుతూ, ఆ పాటలో ఆమె డ్యాన్స్ చేసిన విధానానికి ప్రఖ్యాత నటి మోనికా బెల్లుచి ప్రశంసలు తెలపడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ఇది తనకు లభించిన గొప్ప అభినందనలలో ఒకటి అని పేర్కొన్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ పాట తన పాత్రకు ఒక కొత్త విలువను జోడించిందని చెప్పారని ఆమె చెప్పారు.
