Mega 158 Officially Launched: పూనకాలు లోడింగ్: మెగా బ్రదర్స్ సమక్షంలో మెగా 158 షురూ
మెగా బ్రదర్స్ సమక్షంలో మెగా 158 షురూ

Mega 158 Officially Launched: మెగాభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్ వచ్చేసింది! మెగాస్టార్ చిరంజీవి తన 154వ సినిమా 'వాల్తేరు వీరయ్య'తో బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి బాబీ - చిరు కాంబో మళ్ళీ సెట్స్ మీదకు వచ్చేసింది!
మెగా 158గా పిలవబడుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ నేడు అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అయితే ఈ వేడుకలో అసలైన హైలైట్ ఏంటంటే.. మెగా బ్రదర్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి కళ్ళకు విందు చేశారు! మెగాస్టార్ చిరంజీవి,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకే కారులో వేదిక వద్దకు చేరుకోవడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టి అన్నయ్య సినిమాను ఘనంగా ప్రారంభించగా.. చిరు కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ వేడుకలో నాగబాబు కూడా పాల్గొని సందడి చేశారు.
ఈ చిత్రంలో మరో స్పెషల్ అట్రాక్షన్.. మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్. ఈమె ఈ సినిమాలో చిరంజీవికి కుమార్తెగా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి!

