Poonam Drops Another Bombshell: మరో బాంబ్ పేల్చిన పూనమ్..పవన్ టార్గెట్ గా మరో ట్వీట్
పవన్ టార్గెట్ గా మరో ట్వీట్

Poonam Drops Another Bombshell: తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనూ, రాజకీయ వర్గాల్లోనూ సంచలన వ్యా ఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే హీరోయి న్లలో పూనమ్ కౌర్ ఒకరు. ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు తరచూ హాట్ టాపిక్ అవుతుంటాయి. అసలు విషయ మేంటో చెప్పకుండా... ఎవరినో ఉద్దేశిస్తూ పూనమ్ చేసిన ట్వీట్స్ వివాదాస్పదంగా మారుతాయి.
తాజాగా ఈ నటి పరోక్షం గా పవన్ కల్యాణ్ను టార్గెట్ చేస్తూ మరో బాంబ్ పేల్చింది. 'మూడు నెలల వయసులోనే విదేశాలకు తీసుకెళ్లి పిల్లలకు బాప్టిజం ఇప్పించి, తన వారసత్వాన్ని ఆర్థోడాక్స్ క్యాథలిక్ క్రైస్తవంలోకి ఎందుకు మార్చారు? హిందువుగా ఉండటం అంటే కేవలం రాజకీయ డ్రామా కోసం ఆ కాస్ట్యూమ్స్ ధరించడమేనా? విదేశాలకు వెళ్లగానే ఆ కాస్ట్యూమ్స్ మారిపోతాయా?' అంటూ తన పోస్ట్లో పేర్కొంది. అయితే పూనమ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు రకర కాలుగా స్పందిస్తున్నారు. నేరుగా ఎటాక్ కి దిగారుగా అని ఓ వ్యక్తి రీట్వీట్ చేయగా.. ఇది ఎటాక్ కాదని, తనకు వచ్చిన ఓ డౌట్ మాత్ర మేనని పూనమ్ చెప్పుకొచ్చింది.

