Poonam Kaur’s Sensational Tweets on Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్లు.. ఆ ఆరోపణలతో రేగిన దుమారం
ఆ ఆరోపణలతో రేగిన దుమారం

Poonam Kaur’s Sensational Tweets on Pawan Kalyan: మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాను పవన్ కల్యాణ్ సందర్శించిన నేపథ్యంలో ఈ వివాదం ముదిరింది. ఆదివారం పవన్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి సిక్కుల పవిత్ర స్థలాన్ని దర్శించుకుని, సంప్రదాయ సిక్కు తలపాగా ధరించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనిపై పూనమ్ కౌర్ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.
నకిలీ చిరునవ్వులంటూ విమర్శ:
"వారసత్వాలను మార్చుకుని, దుర్గుణాలను వదిలించుకోని వ్యక్తులు గురువుల పట్ల గౌరవం చూపలేరు. ఈ వేషధారణలు, నకిలీ చిరునవ్వులు కేవలం అధర్మాన్ని కప్పిపుచ్చడానికే" అంటూ ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను మతమార్పిడులకు బ్రాండ్ అంబాసిడర్ అని అభివర్ణిస్తూ.. తన వారసత్వాన్ని కాథలిక్ క్రైస్తవంలోకి మార్చుకున్న వ్యక్తికి గురు తేగ్ బహదూర్ జీని ప్రార్థించే హక్కు లేదన్నట్లుగా ట్వీట్ చేశారు.
పవన్ పిల్లలను ఉద్దేశించి ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు స్పందిస్తూ పూనమ్ మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "పిల్లలను ఎటువంటి కారణం లేకుండా వదిలేశారని, వారి తల్లిని అతని సోదరుడు వేధించారని" పేర్కొంటూ చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
సోషల్ మీడియాలో యుద్ధం
పూనమ్ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పవన్ ఎవరినీ మతమార్పిడి చేయలేదని, ఆయన పిల్లలు హిందువులేనని కౌంటర్ ఇస్తున్నారు. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయం చేయడం సరికాదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. గత కొంతకాలంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి పూనమ్ కౌర్ పరోక్షంగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. అయితే పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, నేరుగా పేరు ప్రస్తావించకుండానే తన లక్ష్యం ఆయనేనని అర్థమయ్యేలా ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

