Power-Packed “Senapathi”: పవర్‌పేటలో పవర్‌ఫుల్ సేనాపతి
పవర్‌ఫుల్ సేనాపతి

Power-Packed “Senapathi”: సందీప్ కిషన్ హీరోగా రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పవర్‌పేట’. 70 ఎంఎం ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. గురువారం సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. థియేటర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో సందడితో ప్రారంభమైన ఈ వీడియో.. అభిమానుల అరుపులు, బాణాసంచా మధ్య హీరో ఎంట్రీ మాస్ ఆడియెన్స్‌ను అలరించేలా ఉంది. సిగరెట్ తాగుతూ సింహం గురించి సందీప్ కిషన్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
అనంతరం తన నేల, ఆ నేలకు బలం ఇచ్చే మనుషులు గురించి చెప్పే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇందులో సేనాపతి రవి అనే పాత్రలో సందీప్ కనిపించనున్నట్టు రివీల్ చేశారు. రగ్డ్ లుక్, స్టైలిష్ షేడ్స్, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్‌తో తన స్ర్కీన్ ప్రెజెన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సినిమాటోగ్రాఫర్ మధీ పీరియాడిక్ సెటప్‌తో విజువల్స్‌ను అందించగా, మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు మరింత ఎనర్జీని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.

